అంగన్ వాడీ టీచర్లకు 500/- నగదు ప్రోత్సాహకం – సత్యవతి రాథోడ్

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారుల వివరాల్ని పోషన్‌ ట్రాకర్‌ యాప్ లో సమర్థంగా పొందుపరిచినందుకు అంగన్‌వాడీ టీచర్లకు 500 రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు.

అంగన్‌వాడీల్లోని గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందిస్తున్న పోషకాహార వివరాలు తదితర అంశాలను నమోదు చేసినందున టీచర్లకు ఒకొక్కరికి రూ.500 చొప్పున ప్రోత్సాహకాన్ని ఇచ్చేందుకు రూ.1.67కోట్ల చెక్కు కార్యదర్శికి అందించారు.