
కొవిడ్-19 నేపథ్యంలో తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా డిజిటల్ తరగతులను డి డి యాదగిరి మరియు టీ సాట్ చానల్స్ నందు ప్రసారం చేస్తున్నారు.
సెప్టెంబరు -1 నుండి ద్వితీయ సంవత్సరం, సెప్టెంబర్ – 18 నుంచి ప్రథమ సంవత్సరం పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నారు.
అయితే సెప్టెంబర్ 21 నుండి కళాశాలలకు గరిష్టంగా రోజుకో 50 శాతం మంది టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది హజరు కు సంబంధించిన గైడ్ లైన్స్ ను ఇంటర్ విద్యా శాఖ విడుదల చేసింది.
● కళాశాలకు గరిష్టంగా 50 శాతం మంది టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది హజరు కావాలి.
● మిగిలిన 50 శాతం సిబ్బంది తరువాతి రోజు కళాశాలకు హాజరు కావలసి ఉంటుంది
● అయితే హాజరు కాని 50శాతం సిబ్బంది కూడా వాట్సాప్ మరియు ఇతర ఆన్లైన్ పద్ధతుల ద్వారా విద్యార్థుల విద్యా సంబంధ సమస్యలను ఇంటి వద్ద నుండి తీర్చ వలసి వుంటుంది.
● అలాగే మొదటి సంవత్సరం అడ్మిషన్లను కూడా ఇంటి వద్ద నుండి గాని పదవ తరగతి పాస్ అయిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి గాని చేయవలసి ఉంటుంది.
● ప్రతి అధ్యాపకుడు 50% హజరుతో సంబంధం లేకుండా విద్యార్థులకు ఆన్లైన్ పద్దతిలో అందుబాటులో ఉండాలి.
● నాన్ టీచింగ్ సిబ్బంది కూడా 50% హజరుతో సంబంధం లేకుండా ప్రిన్సిపాల్ కు అందుబాటులో ఉండాలి.
● ప్రిన్సిపాల్ ఆన్లైన్ తరగతులను, సిబ్బంది హాజరును, మరియు అడ్మిషన్లను మానిటర్ చేయవలసి ఉంటుంది.
● కోవిడ్ నిబంధనలు ప్రకారం సిబ్బంది భౌతిక దూరం పాటించేలా, మాస్కులు దరించేలా చర్యలు తీసుకుంటూ… కళాశాలను ఫాగింగ్, క్లీనింగ్ శానిటైజేషన్ ను చేపించాలి.
● ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులకు విద్యా సంబంధ విషయాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి.

