తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 3,584 మంది కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల వేతనాలు చెల్లించడానికి 4వ క్వార్టర్ బడ్జెట్ ను కమిషనర్ ఉమర్ జలీల్ ఈరోజు విడుదల చేశారు.
జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలు చెల్లించడానికి దాదాపు 40.97 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
అలాగే రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 817 మంది కాంట్రాక్టు డిగ్రీ అధ్యాపకుల వేతనాలు జనవరి, పిబ్రవరి, మార్చి నెలలకు చెల్లించడానికి 9.87 కోట్లను కాలేజియోట్ ఎడ్యుకేషన్ కమీషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేసారు.
నెలనెలా వేతనాలు చెల్లించాలని ఎన్నిసార్లు మంత్రులు మరియు ఇంటర్విద్యా అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడం జరిగిందని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ నాయకులు తెలిపారు. త్వరలోనే దానికి సంబంధించిన ఉత్తర్వులు రప్పించడానికి కృషి చేస్తామని తెలిపారు.
4TH QUARTER BUDGET PROCEEDINGS
https://drive.google.com/file/d/1l5COcE7gYO40M-795Lvg2Z9RoChHHDZq/view?usp=drivesdk
Follow Us @