- నూతన అధ్యాపకుల సర్వీసు కు సంబంధించిన ఎలాంటి నష్టం రానీయం
- ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నాం.
- ఇంటర్ విద్య డైరెక్టర్ గారు వెల్లడి
BIKKI NEWS (May 14) : 475 union meet intermediate comissioner krshna adithya today. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న నూతన అధ్యాపకులు యొక్క సమస్యలను పరిష్కరించాలని ఈరోజు తెలంగాణ ఇంటర్ విద్య డైరెక్టర్ మరియు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య ఐఏఎస్ గారికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ _475 రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వసుకుల శ్రీనివాస్, డాక్టర్ కుప్పిశెట్టి సురేష్ తెలిపారు.
475 union meet intermediate comissioner krshna adithya today
ఈరోజు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయంలో గౌరవ ఇంటర్విద్య డైరెక్టర్ గారితో TGJLA_475 ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా 2023 మే నెలలో క్రమబద్ధీకరించబడ్డ నూతన అధ్యాపకులకు రెగ్యులేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలని, వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో కొంతమంది కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గౌరవ ఇంటర్ విద్యా డైరెక్టర్ గారు దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.
వారు సానుకూలంగా స్పందిస్తూ, నూతన అధ్యాపకుల సర్వీస్ విషయాలకు సంబంధించి ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని, ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడితే, ఇంటర్ విద్య ఆఫీసర్స్ దృష్టి తీసుకురావలసిందిగా తెలియజేస్తూ,.ఈ నెల 22 నుంచి నిర్వహించే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సమర్థవంతంగా నిర్వహించాలని, 2025 -26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ఎక్కువగా ఉండేటట్లు చూడాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి విద్యార్థులకు న్యాయమైన విద్య అందించినట్లు చూడాలని తెలిపినట్లు కొప్పశెట్టి సురేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 తరఫున పలు సూచనలు అందజేయడం జరిగింది. గౌరవ ఇంటర్ విద్యా డైరెక్టర్ గారు స్పందిస్తూ… ప్రభుత్వ జూనియర్ కళాశాల చదివి విద్యార్థులకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండేటట్లు, జిల్లా ఇంటర్ విద్యాఆఫీసర్లు, సంబంధిత జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళామని, ప్రభుత్వ జూనియర్ కళాశాల చదివి విద్యార్థులకు రవాణా సౌకర్యాలు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులో ఉండేటట్లు చూస్తామని తెలిపారు.
అదే విధంగా వారికి హాస్టల్లో వసతి కల్పించే విషయంలో, జిల్లా కలెక్టర్ సహకారం కూడా తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థుల అటెండెన్స్ పెరగటానికి సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ -475,రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, డాక్టర్ వి శ్రీనివాస్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయిని శ్రీనివాస్ ,గోవర్ధన్ ,పూర్ణచందర్, సాయిలు, కేపీ శోభన్ బాబు, రాష్ట్ర మహిళా కార్యదర్శి సంగీత, షాహినా బేగం, విశాలాక్ష్మి, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్, హరగోపాల్, పాతూరి రాజిరెడ్డి, గోక గణేష్, భాస్కర్ ,గుమ్మడి మల్లయ్య ,ఏ తిరుపతిరావు ,దాసు నాగరాజు, బండి నరసింహా, రాజు,
ప్రేమ సాగర్ ,నవీన రెడ్డి, ప్రశాంత్ రజినీకాంత్ జి వెంకటేశ్వర్లు బండి ప్రసాదు ,కలీముల్లా, గుండె రావు, రాములు గణేష్ మేదర వెంకట ముత్యం తదితరులు పాల్గొన్నారు
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్
- AP DEECET COUNSELING 2025 షెడ్యూల్