ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల దృష్టికి కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు

జగిత్యాల 475 జిల్లా కమిటీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిలను నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా రెగ్యులర్ ఉద్యోగులకు పెంచిన వయోపరిమితిని కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింపజేయాలని జీవో నెంబర్ 16 పై న్యాయపరమైన చిక్కులు తొలగిన దృష్ట్యా జి.ఓ అమలు చేయుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విన్నవించడం జరిగింది.

దానిపై సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి లు సానుకూలంగా స్పందించారని. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హమీ ఇచ్చారని అధ్యక్షుడు రేమిడి మల్లారెడ్డి తెలిపారు.

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల గంగాధర్, ఉపాధ్యక్షులు బాల మల్లయ్య, సత్యనారాయణ, మహేష్, తిరుపతి, వెంకట నరసయ్య, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు