GCLA475 నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి

ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డిని డా. కొప్పిశెట్టి సురేష్ నేతృత్వంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే మంత్రి చేతుల మీదుగా సంఘం కాలెండర్ ను ఆవిష్కరింపజేశారు.

ఈ సందర్భంగా క్రమబద్ధీకరణకు సంబంధించి కోర్టు తీర్పు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని సానుకూలంగా పరిష్కరిస్తారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారని కొప్పిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ అసోసియేట్ ప్రెసిడెంట్ కేపి శోభన్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యమ్. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ పడాల జగన్నాథం, రాష్ట్ర మహిళా కార్యదర్శి సంగీత, రాష్ట్ర నాయకులు భాస్కర్, ఎం. పూర్ణచంద్ర, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మనోహర్ పాల్గొన్నారు.