హైదరాబాద్ (డిసెంబర్ – 10) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లు భవనాల శాఖలో 472 నూతన పోస్టులను మంజూరు చేసింది.
ఈ శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది.
ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖ లోని రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో 3 చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను, 10 సర్కిల్ కార్యాలయాలను, 13 డివిజన్ కార్యాలయాలను, 79 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖను కేబినెట్ ఆదేశించింది.