హైదరాబాద్ (డిసెంబర్ – 12) : తెలంగాణలోని న్యాయస్థానాల్లో 4,600కు పైగా సిబ్బంది నియామకం కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు డిసెంబరు 12న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఈ 4,600ఖాళీలను వెంటనే నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినేట్ ఆదేశించింది. దీంతో కోర్టుల్లో సిబ్బంది నియామకాల కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు తాజాగా అనుమతి లభించినట్లైంది. ఈ నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.