కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు 4 నెలల వేతనాలు వెంటనే చెల్లిచాలి : కొప్పిశెట్టి

హైదరాబాద్ (ఆగస్టు – 10) : ప్రభుత్వం డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు గత నాలుగు నెలల నుంచి చెల్లించాల్సిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ఈరోజు కాలేజియోట్ కమిషనర్ కు మరియు ఇంటర్ విద్యా కమిషనర్ కి విజ్ఞప్తి చేసినట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శులు జి రమణ రెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.

డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 4500 మంది పైగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వేతనాలు లేక అప్పులతో కుటుంబాలను నడుపుతున్నారని, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాల్లో కలహాలు అవుతున్నాయని తెలుపుతూ, వృద్ధులైన తల్లిదండ్రులను మరియు బ్యాంకులో ఈఎంఐలు కట్టలేక మానసిక అశాంతికి గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారని తెలుపుతూ, ఈ విషయంపై గత నెలలో ఆర్థిక శాఖ ఉన్నత అధికారులు ఆర్థిక శాఖ MEMO NO 1599066_C/228/A1/B.G/2022,date 02/07/2022 , ద్వారా 2022_2023 బడ్జెట్ అంచనాల్లో 50% వేతనాలు చెల్లించుట కొరకు అనుమతి ఇచ్చినప్పటికీ, ప్రభుత్వ డిగ్రీ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు వేతనాలు చెల్లించలేదని తెలిపారు.


ఈ విషయంపై ఈరోజు కాలేజియోట్ కమిషనర్ మరియు ఇంటర్ విద్య కమిషనర్ ల దృష్టికి మరియు ఉన్నతఅధికారుల దృష్టికి తమ సంఘం ద్వారా తీసుకువెళ్లడం జరిగిందని తెలుపుతూ.., వెంటనే కాంట్రాక్ట్ లెక్చర్ కి సంబంధించిన వేతనాలు ప్రొసీడింగ్స్ జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

Follow Us @