ISHAN KISHAN DOUBLE CENTURY

చిత్తోగ్రాం (డిసెంబర్ -10) : బంగ్లాదేశ్ ఇండియా జట్ల మద్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా ఓపెనర్ గా దిగిన ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. రెండు వన్డేల్లో ఓడిన కసిని చూపిస్తూ బంగ్లాదేశ్ బౌలర్లకు పగలే చుక్కలు చూపించే బ్యాటింగ్ తో కేవలం 131 బంతుల్లో 210 పరుగులు సాదించగా (ISHAN KISHAN DOUBLE CENTURY) మరోవైపు విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ పోషిస్తూ 113 పరుగులు చేశాడు.

50 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 409/8 సాదించింది. చివరి పది ఓవర్లలో టీమిండియా కేవలం 70 పరుగులు మాత్రమే సాదించింది.