Home > JOBS > TELANGANA JOBS > ANGANWADI JOBS – 3,989 పోస్టులు భర్తీకి ఆమోదం – మంత్రి సీతక్క

ANGANWADI JOBS – 3,989 పోస్టులు భర్తీకి ఆమోదం – మంత్రి సీతక్క

హైదరాబాద్ (డిసెంబర్ – 15) : తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రిగా సీతక్క గురువారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలను (3,988 Anganwadi jobs Recruitment in telangana) ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని 3,989 అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించినా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటి మార్పు జరగలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫైల్ పైనా మంత్రి సంతకం చేయడంతోపాటు అప్గ్రేడ్ చేసిన కేంద్రాలకు కొత్తగా 3,989 హెల్పర్లను నియమించుకునే ప్రతిపాదనను ఆమోదించారు.

ప్రతిజిల్లాకు ఒక శిశుసంరక్షణ కేంద్రం (క్రెచ్ సెంటర్) ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేంద్రాల్లో ఆరునెలల నుంచి ఆరేళ్ల పిల్లల వరకు సంరక్షిస్తారు. ప్రతి కేంద్రానికి ఇద్దరు సంరక్షకులు ఉంటారు. కేంద్రాల నిర్వహణ, వేతనాల చెల్లింపులకు రూ.1.27 కోట్లు కేటాయించారు. ఈ ఫైల్ పై మంత్రి సంతకం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల ఎదుగుదల, పోషణస్థితిని అచనా వేసేందుకు, ఎత్తు, బరువు కొలిచేందుకు పోషన్ అభియాన్ 2.0 పథకం కింద పరికరాల కొనుగోలుకు రూ.28.56 కోట్లు మంజూరు చేస్తూ ఇందుకు సంబంధించిన ఫైల్ ను క్లియర్ చేశారు. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతం గా ఉండనుంది.