BIKKI NEWS (AUG. 26) : 35 thousand jobs will fill soon in telangana. త్వరలోనే 35 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తొలి 90 రోజుల్లోనే 30 వేల నియామక పత్రాలను అందజేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
35 thousand jobs will fill soon in telangana
సివిల్స్ ప్రివిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద 135 మందికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అలాగే మెయిన్స్ పరీక్ష తర్వాత ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు కూడా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు
ఈ 35 వేల ఉద్యోగాలలో ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలు, జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ మరియు గ్రూప్ – 4 మరియు తదితర ఉద్యోగాలు ఉండనున్నాయి.