న్యూడిల్లీ (డిసెంబర్ – 15) : దేశవ్యాప్తంగా 3,375 సివిల్ సర్వీసెస్ ఉద్యోగా ఖాళీగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
వీటిలో 1,472 ఐఏఎస్, 864 ఐపీఎస్, 1,057 ఐఎప్ఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది.
సివిల్ సర్విసెస్ పోస్టులను యూపిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ప్రతి సంవత్సరం నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే 2023 సివిల్స్ నోటిఫికేషన్ లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారా లేదా అనేది తెలియల్సి ఉంది.