భారత వాయుసేనలో 334 ఉద్యోగాలు

భార‌త వాయు సేన (IAF) ఏటా నిర్వ‌హించే ఎయిర్ ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ (AFCAT) ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ జూన్ 1 నుంచి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ది. ఈ పరీక్ష ద్వారా 334 ఫ్ల‌యింగ్ డ్యూటీ, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీల్లో క‌మిష‌న్డ్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో టెక్టిక‌ల్‌, నాన్‌టెక్నిక‌ల్ పోస్టులు ఉంటాయి.


● అర్హ‌త‌లు ::

  • ఫ్లయింగ్ బ్రాంచీకి ఇంట‌ర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల్లో క‌నీసం 50% మార్కులు రావాలి. అదేవిధంగా డిగ్రీ 60% మార్కుల‌తో ఉత్తీర్ణుల‌వ్వాలి.
  • గ్రౌంట్ డ్యూటీ టెక్నిక‌ల్, నాన్ టెక్నిక‌ల్‌ బ్రాంచీకి ఇంటర్ లో ఫిజిక్స్‌, మ్యాథ్స్ స‌బ్జెక్టుల్లో 60% మార్కులు, నాలుగేండ్ల డిగ్రీ ఉత్తీర్ణుల‌వ్వాలి.

● వయస్సు ::అభ్య‌ర్థులు 25 ఏండ్ల‌లోపు ఉండాలి.

● ఎంపిక విధానం :: రాత‌ప‌రీక్ష, ఆఫీస‌ర్స్ ఇంటెలిజన్స్ రేటింగ్ టెస్ట్ అండ్ పిక్చ‌ర్ ప‌ర్సెప్ష‌న్ అండ్ డిస్క‌సింగ్ టెస్ట్‌, సైక‌లాజిక‌ల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ.

● ప‌రీక్ష విధానం ::
ప‌రీక్ష 100 ప్ర‌శ్న‌ల‌కు ఉంటుంది. వీటికి మొత్తం 300 మార్కులు. ఇందులో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌లో వ‌ర్బ‌ల్ ఎబిలిటీ, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, రీజ‌నింగ్‌, మిల‌ట‌రీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు.

ప‌రీక్ష‌ను 2 గంట‌ల్లో రాయాల్సి ఉంటుంది. ప్ర‌తి త‌ప్పు జ‌వాబుకు ఒక మార్కు కోత విధిస్తారు.

● ప‌రీక్ష ఫీజు :: రూ.250/- NCC స్పెష‌ల్ ఎంట్రీకి ఎలాంటి ఫీజు లేదు.

● ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ :: ఆన్లైన్‌లో

● ద‌ర‌ఖాస్తులు ప్రారంభం :: జూన్ – 1 – 2021

● చివ‌రి తేదీ :: జూన్ – 30 – 2021

● వెబ్సైట్‌ :: www.careerindianairforce.cdac.in

www.afcat.cdac.in

Follow Us@