3261 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన SSC

స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ (S.S.C.) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3261 ఉద్యోగాల భర్తీకి సెలెక్షన్‌ పోస్ట్‌ ఫేజ్‌ 9 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆన్లైన్‌ దరఖాస్తులు అక్టోబర్‌ 25 వరకు అందుబాటులో ఉంటాయి. రాతపరీక్ష ద్వార అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

● మొత్తం పోస్టుల సంఖ్య :: 3261 (జనరల్‌ 1366, ఎస్సీ 477, ఎస్టీ 249, ఓబీసీ 788, ఈడబ్ల్యూఎస్‌ 381)
ఇందులో ఎంటీఎస్‌, డ్రైవర్‌, సైంటిఫక్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, హెడ్‌ క్లర్క్‌, కన్సర్వేషన్‌ అసిస్టెంట్‌ టెక్నికల్‌ పోస్టులు ఉన్నాయి.

● అర్హతలు : : డిగ్రీ, ఇంటర్‌, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

● ఎంపిక విధానం :: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్. రాతపరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్‌లో

● దరఖాస్తు ఫీజు :: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

● చివరి తేదీ :: అక్టోబర్‌ 28

● రాత పరీక్ష :: 2022, జనవరి లేదా ఫిబ్రవరిలో

● వెబ్సైట్‌ :: www.ssc.nic.in

● పూర్తి నోటిఫికేషన్ :: డౌన్లోడ్