కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30% వేతనం పెంచుతూ ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నూతన పీఆర్సీ 2020 ప్రకారం పెంచిన 30 శాతం వేతనంతో కూడిన నూతన వేతనాన్ని జూన్ మాసం నుండి అమలు చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

జీవో నెంబర్ 14 ప్రకారం మూడు కేటగిరీలుగా ఉన్నా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్నా వేతనానికి 30 శాతం వేతనం కలిపి చెల్లించాలని అదేవిధంగా సంబంధిత క్యాడర్ కు ఉన్న మినిమం ఆప్ టైం స్కేల్ వేతనం లేదా పెంచిన 30 శాతం వేతనంలలో ఏది తక్కువగా ఉంటే దానిని చెల్లించాలని పేర్కొన్నారు.

● కేటగిరీ – I :: 12,000 నుంచి 15,600

● కేటగిరీ – II :: 15,000 నుంచి 19,500

● కేటగిరీ – III :: 17,500 నుంచి 22,750 వరకు వేతనాలు పెరగనున్నాయి.

◆ డైలీ వెజెస్, పుల్ టైం కంటింజెంట్ లేబర్, పార్ట్ టైం ఉద్యోగులకు 30% పెంపు

అలాగే డైలీ వెజెస్ లేబర్/ క్యాజువల్ లేబర్ కు రోజుకి 300 బదులు 390, అలాగే పుల్ టైం కంటింజెంట్ లేబర్ కు నెలకు 8 వేలకు బదులు 10,400 రూపాయలు, పార్ట్ టైం ఉద్యోగికి నెలకు 4,000 కి బదులు 5,200 వేతనాలు నూతన పీఆర్సీ ప్రకారం పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది

నూతన పి ఆర్ సి 2020 ప్రకారం పెంచిన వేతనాలు జూన్ నెల అమలు చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Follow Us @