తాత్కాలిక ఉద్యోగులకు కూడా పీఆర్సీ – సీఎం కేసీఆర్

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, హోంగార్డులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ, విద్యావలంటీర్లు‌, సెర్ప్ వంటి సహా తాత్కాలిక ఉద్యోగులందరికీ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీని ఏప్రిల్ 1 నుండి 30 శాతం ఫిట్మెంట్ తో అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు కనకచంద్రం, కొప్పిశెట్టి సురేష్, గాదె వెంకన్న, వినోద్ కుమార్ సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us @