న్యూడిల్లీ (ఆగస్టు – 06) ; కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పనున్నట్లు సమాచారం. త్వరలోనే DAను 3% పెంచి.. ప్రస్తుతం అందుతున్న DAను 42% నుంచి 45శాతానికి చేర్చాలని భావిస్తోంది.
ఈరోజు లేదా రేపు దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉండగా.. పెరిగే డీఏ జూలై 1, 2023 నుంచి అమల్లోకి రానుంది. కాగా మార్చిలో 4శాతం డీఏను పెంచిన సంగతి తెలిసిందే. డీఏ పెరిగితే ఉద్యోగులు, పెన్షనర్లు అందుకునే జీతాలు
పెరగనున్నాయి.