ఇంటర్ పరీక్షల రద్దుపై సబితా ఇంద్రారెడ్డి అధికారిక ప్రకటన

తెలంగాణ లో ఇంటర్మీడియట్ సెకండీయర్పరీక్షలు రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటన చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఫలితాలు ఎలా అనే దాని పై త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సబితా పేర్కొన్నారు.

విద్యార్థులు, తల్లి తండ్రులు ఆందోళన నేపథ్యంలో పరీక్షలు రద్దు. ఇప్పటికే పదవ, ఇంటర్ ప్రధమ సంవత్సరం పరీక్షలు రద్దు చేసినట్లు వెల్లడించారు.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రథమ సంవత్సరం ఇంటర్ విద్యార్దులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే సెకండ్ ఇయర్ ఇంటర్ విద్యార్థుల పరీక్షల విషయం పై సందిగ్ధం కొనసాగుతుంది.

ఇప్పటికే CBSE 12వ తరగతి పరీక్షలు మరియు పలు రాష్ట్రలలో ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు అయినా విషయం తెలిసిందే.

Follow Us @