తెలంగాణలో రెండో డోస్ వ్యాక్సినేషన్ – సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నిలిచిపోయిన రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను మంగళవారం నుంచి ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదటి డోసు పూర్తి చేసుకుని రెండో డోసు కోసం అర్హత కలిగిన వాళ్లు దగ్గరలో వున్న ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు.

అలాగే కరోనా వ్యాధిని ఎక్కువగా వ్యాప్తి చేసే అవకాశం ఉన్నవారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందుకు సంబంధించిన విదివిధానాలను రూపొందించాలని మంత్రి హరీష్ రావును, వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

Follow Us@