విద్యార్దులకు ఆన్లైన్ తరగతుల కోసం 2 GB డేటా ఉచితం.

తమిళనాడు విద్యార్థులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి శుభ‌వార్త చెప్పారు. రాష్ట్రంలోని విద్యార్థులంద‌రికీ రోజుకు 2జీబీ చొప్పున మొబైల్ డేటాను ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో రాష్ట్రంలోని 9 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంద‌ని సీఎం చెప్పారు.

కొవిడ్ -19 విస్త‌ర‌ణ‌ నేపథ్యంలో విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. క‌రోనా ప్ర‌భావం ఇప్ప‌టికీ పూర్తిగా త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆన్లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. త‌మిళ‌నాడులో యూజీ, పీజీ విద్యార్థులకు త‌ర‌గ‌తులు ప్రారంభమైనా.. ఎక్కువ మంది ఆన్లైన్‌ పాఠాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ కాలేజీలతోపాటు స్కాలర్‌షిప్‌ల‌తో చదువుకునే ప్రైవేట్ కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత మొబైల్ డేటా ఈ సౌలభ్యం అందించ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.

Follow Us@