త్వరలో 29% పీఆర్సీ – సబితా ఇంద్రారెడ్డి

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరపున బరిలో ఉన్న దివంగత మాజీ ప్రధాని పీవీ కూతురు వాణీదేవికి ఒక్క అవకాశమివ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి పట్టభద్రులను కోరారు.

టీఆర్‌ఎస్‌తోనే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఆరున్నరేండ్లలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అధిక వేతనాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని, త్వరలోనే 29 శాతం పీఆర్సీ కూడా ఇవ్వనున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

Follow Us@