Home > LATEST NEWS > Teacher recruitment cancelled – 25 వేల టీచర్ నియామకాలు రద్దు

Teacher recruitment cancelled – 25 వేల టీచర్ నియామకాలు రద్దు

BIKKI NEWS (APR. 03) : 25000 TEACHER RECRUITMENT CANCELLED BY SUPREME COURT. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం 2016 లో చేపట్టిన 25,753 మంది టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

25000 TEACHER RECRUITMENT CANCELLED BY SUPREME COURT

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో పలు అవకతవకులు జరిగాయని పలువురు కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా కలకత్తా హైకోర్టు గతేడాది ఈ నియామకాలను రద్దు చేస్తూ వారు తీసుకున్న జీతభత్యాలను కూడా రికవరీ చేయాలని సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా గత ఏడాది తీర్పుపై స్టే విధించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా పశ్చిమబెంగాల్ కోర్టు ఇచ్చిన తీర్పునుళ సమర్థిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో ఈ నియామకాలు రద్దచేసి, నూతన నియామకాలను చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

అలాగే ఆ నియామకాలు కింద ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తమ జీతభత్యాలను చెల్లించాల్సిన అవసరం లేదని వారికి ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు