విజయవాడ (నవంబర్ – 12) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 21 కులాలను బీసీలుగా గుర్తిస్తూ (21 casts identified as bc casts in ap) నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు ప్రాంతాలను బట్టి బీసీ లుగా ఉన్న ఈ కులాలు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా బీసీ లుగా పరిగణనలోకి తీసుకుని సర్టిఫికెట్ లు జారీ చేస్తారు.
బీసీ ల జాబితాలోకి చేరిన 21 కులాల జాబితా
BC-A: కురకుల, పాండర, సామంతుల (సామంత, సౌంటియా), పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట
BC-B: అచ్చుకట్లవాండ్లు, గౌడ (ఈడిగ, గౌడ, గమల్లా), కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ, కుంచిటి ఎక్కలింగ (వక్కలింగ, కుంచిటిగ), గుడ్ల(గుడ్లయ)
BC-D: మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, అయ్యరక, నగరాలు, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య (బెరి శెట్టి), అతిరాస, కుర్మి, కలింగ కోమటి (కలింగ వైశ్య)