టీఎస్ ఎడ్‌సెట్ – 2022 ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

టీఎస్ ఎడ్‌సెట్ -2022 ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగించారు. ఎలాంటి ఆల‌స్యం రుసుం చెల్లించ‌కుండా జులై 6వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని ఎడ్‌సెట్ నిర్వాహ‌కులు తెలిపారు.

ఈ అవ‌కాశాన్ని అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు వినియోగించుకోవాల‌ని సూచించారు. చివ‌రి సంవ‌త్స‌రం, చివ‌రి సెమిస్ట‌ర్ ఫ‌లితాల కోసం ఎదురుచూసే అభ్య‌ర్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఇత‌ర వివ‌రాలో కోసం edcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.