కాంట్రాక్ట్ లెక్చరర్ ల సర్టిఫికెట్ల పరిశీలనకు త్రిసభ్య కమిటీ

ఇంటర్ విద్యలో కాంట్రాక్ట్ లెక్చరర్లు సమర్పించిన సర్టిఫికెట్లను పరిశీలించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఇంటర్ కమీషనరేట్ సంప్రదించింది. ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఉన్నత విద్యామండలికి లేఖ రాయగా, సర్టిఫికెట్ల పరిశీలనకు ఉన్నత విద్యామండలి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రొఫెసర్ జీబీరెడ్డి, ప్రొఫెసర్ రాజశేఖర్రెడ్డి, ప్రొఫెసర్ వెంకటయ్యతో కూడిన కమిటీ ఈ నెల 27 న మరోక్కమారు సమావేశం కానున్నది.

సర్టిఫికెట్లు జారీచేసిన వర్సిటీలు యూజీసీ గుర్తింపు పొందినవా ? లేదా ? డిస్టెన్స్ ద్వారా ఆయా కోర్సులను నిర్వ హించవచ్చా? అన్నది కమిటీ తేల్చుతుంది.