జూన్ 13 నుండే స్కూల్స్ – మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో విద్యాసంస్థల రీ-ఓపెనింగ్‌పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.

తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే సోమవారం(జూన్‌13) నుంచి విద్యా సంస్థలను తెరవనున్నట్టు స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లో ఎలాంటి పొడిగింపులేదని క్లారిటీ ఇచ్చారు.