క్రమబద్ధీకరణ చర్యలు వేగవంతం పట్ల హర్షం – ఉదయ భాస్కర్, సునీల్

ఉన్నత విద్యా శాఖ పరిధిలో పని చేస్తున్న జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ ల క్రమబద్దీకరణ ప్రపోజల్స్ ను త్వరగా పంపాలని ఈరోజు ఉన్నత విద్యా శాఖ జారీ చేసిన మెమో పట్ల తెలంగాణ ఆల్ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు జి. ఉదయ భాస్కర్, జనరల్ సెక్రెటరీ జి. సునీల్ మరియు నవీన్ లు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత శాఖలు త్వరగా అర్హత కలిగిన వారి జాబితా పంపించవలసిందిగా కమీషనర్ లకు విన్నవిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి, పాతూరి సుధాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.