గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక

  • రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గా దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్
  • జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల సమస్యల సాధనే లక్ష్యంగా శ్రమిస్తాం: నూతన రాష్ట్ర కమిటీ నాయకులు

హైద్రాబాద్: తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేసీజీఎల్ఏ-2152) నూతన రాష్ట్ర కమిటీ ని గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి ఆన్లైన్ సమావేశంలో ఎన్నుకున్నట్లు ఆ సంఘ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడిగా హైద్రాబాద్ కు చెందిన దామెర ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా వరంగల్ కు చెందిన దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా నల్గొండ కు చెందిన కోడి మహేష్ కుమార్, కోశాధికారిగా మెదక్ జిల్లాకు చెందిన బండి కృష్ణ లను ఎన్నకున్నట్లు గా తెలిపారు. అదేవిధంగా సంఘం ముఖ్య సలహాదారులుగా “తెలంగాణ ఇంటర్మీడియేట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్” (టిగ్లా) బాధ్యులు ఎం. జంగయ్య, ఎం. రామకృష్ణ గౌడ్ లు కొనసాగుతారని బాధ్యులు తెలిపారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎం. బాబురావు, ఎల్. శ్రీకాంత్ రావు, సీ. హేచ్ దేవయ్య, ఎ. రమేష్ రెడ్డి, కె. కవిత, మహిళా కార్యదర్శులుగా జి. శ్రీవిద్య, నవమణి, పి. రీనా, జి. రాధిక, సంయుక్త కార్యదర్శులుగా పి. రాంమూర్తి, కె. సమ్మయ్య, అబ్దుల్ నబీ, డా,, నెమలి గాంధీ, బి. యాకేష్ అధికార ప్రతినిధులుగా డా,, జి. ప్రసాద్, కె. నవీన్ రెడ్డి, డా,, కె. యుగంధర్, మీడియా ఇంచార్జులుగా కె. వెంకటేష్, ఎస్. పరమేశ్, బిళ్ల రమేష్, లీగల్ సెల్ ఇంచార్జి గా ఇ. అరుణ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా పి. ఇస్సాక్, ఎస్. ఊర్వశి, ఎం. చిరంజీవి, సుమతి, సీహెచ్. రజిత, ఎం. స్వామి లు ఎన్నికైనట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు.

ఈ క్రమంలో ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ..గెస్ట్ లెక్చరర్ల సంఘం ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు పూర్తై నాలుగవ సంవత్సరంలో కి అడుగుడితున్న క్రమంలో గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారంలో క్రియాశీలంగా వ్యవహరిస్తామని, ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల సహకారంతో కన్సాలిడేట్ పే, ఆటో రెన్యూవల్ సాధనలో నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి తప్పకుండా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం వరకు సాధించే దిశగా పోరాడుతామని వెల్లడించారు. అదేవిధంగా తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్టరర్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.