ఎప్పటిలాగే ఇంటర్ హిందీ, కన్నడ, మరాఠీ ప్రశ్న పత్రాలు

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో చేతిరాతతో రాసిన ప్రశ్నపత్రాలను జిరాక్స్ చేసి ఇచ్చారని వచ్చిన ప్రచారంపై ఇంటర్ బోర్డు వివరణ ఇచ్చింది. మూడు దశాబ్దాలుగా హిందీ, కన్నడ, మరాఠీ మీడియా ప్రశ్నాపత్రాలను ఇలాగే ఇవ్వడం కొనసాగుతున్నదని, ఇప్పుడూ అలాగే ఇచ్చామని స్పష్టం చేసింది.

బుధవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పొలిటికల్ సైన్స్ పరీక్ష నిర్వహించారు. హిందీ మీడియాన్ని నిర్వహిస్తున్న కాలేజీలు రెండే ఉండటంతో హిందీ, కన్నడ, మరారీ మాధ్యమాల్లో పుస్తకాలను రూపొందించటం లేదు. రెగ్యులర్ లెక్చరర్లు కూడా లేకపోవటంతో హిందీ మీడియంలో ప్రశ్న పత్రాలను రూపొందించటం లేదు. దీంతో తెలుగు, ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలను హిందీ, కన్నడలోకి ట్రాన్సలేట్ చేసి, చేతిరాతతో రాసినవి జిరాక్స్ తీసి అందిస్తున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వివరించారు.

మార్చి 5 న జారీచేసిన ఉత్తర్వుల్లో కాలేజీలకు వివరణ కూడా ఇచ్చామని తెలిపారు. ట్రాన్స్లేషను కు సమయం పట్టడంతో విద్యార్థులు నష్టపోకుండా అదనంగా సమయం కేటాయించామని, ఎక్కడా తప్పిదం జరగలేదని పేర్కొన్నారు.