మే 11 చరిత్రలో ఈరోజు

దినోత్సవం :

  • జాతీయ సాంకేతిక దినోత్సవం

★ సంఘటనలు :

1502 : కొలంబస్ ఇండీస్ దీవులకు తన చివరి (నాలుగవ) యాత్రను మొదలుపెట్టాడు.
1751 : మొదటి అమెరికన్ ఆసుపత్రిని స్థాపించారు (పెన్సిల్వేనియా హాస్పిటల్)
1752 : మొదటి అగ్నిప్రమాద భీమా పధకాన్ని అమెరికాలో మొదలు పెట్టారు (ఫిలడెల్ఫియా)
1772 : ఆమ్‌స్టర్‌డాం థియేటర్ (రంగశాల) అగ్నిప్రమాదంలో తగులబడి, 18 మంది మరణించారు.
1784 : టిప్పు సుల్తాను ఇంగ్లాండుతో మైసూరు శాంతి ఒప్పందం చేసుకున్నాడు.
1792 : అమెరికన్ కెప్టెన్ రాబర్ట్ గ్రే, కొలంబియా నదిని కనుగొని, దానికి కొలంబియా అని పేరు పెట్టారు.
1816 : అమెరికన్ బైబిల్ సొసైటీని స్థాపించారు (న్యూయార్క్ లో).
1833 : లేడీ ఆఫ్ ది లేక్ అనే నౌక మంచుఖండాన్ని (ఐస్‌బెర్గ్), ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ములిగిపోయింది. 215 మంది మరణించారు.
1850: మొదటి సారిగా ఇటుకలతో భవనాలు కట్టడం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొదలైంది.
1858 : మిన్నసోటా రాష్ట్రం, 32వ రాష్టంగా అమెరికాలో చేరింది.
1893 : హెన్రీ డెస్‌గ్రేంజ్ మొదటి ప్రపంచ సైకిల్ రికార్డుని స్థాపించాడు (35.325 కి.మీ)
1916 : ఐన్‌స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం వెల్లడించాడు. (థియరీ ఆఫ్ జనరల్ రెలెటివిటీ).
1921 : టెల్ అవివ్ మొట్టమొదటి యూదుల మునిసిపాలిటీ (నేటి ఇజ్రాయిల్ రాజధాని).
1928: జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీ మొదటి టెలివిజన్ కేంద్రాన్ని (టి.వి.స్టేషను) ని మొదలు పెట్టింది (న్యూయార్క్ లోని షెనెక్టాడీ లో).
1929: రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా ప్రసారమయ్యాయి (వారానికి 3 రాత్రులు).
1949: మొదటి పోలరాయిడ్ కెమెరాని 89.95 అమెరికన్ డాలర్లకు న్యూయార్క్ లో అమ్మారు.
1949: ఇజ్రాయిల్ 37-12 ఓట్లతో, 59వ సభ్యదేశంగా, యునైటెడ్ నేషన్స్ లో చేరింది.
1949: సియాం (సయాం) దేశం తన పేరుని థాయ్‌లాండ్గా మార్చుకున్నది.
1955: ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేసింది.
1958: అమెరికా బికినీ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది.
1961: హైదరాబాదులో రవీంద్ర భారతి కళావేదిక ప్రారంభించబడింది.
1962:అమెరికా క్రిస్ట్‌మస్ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది.
1965: భారతదేశంలో, 1965 లో, ఒక్క నెలలోపే వచ్చిన 2 తుఫానులలో, మొదటి తుఫానుకి 35,000 మంది మరణించారు.
1977 : తెలుగు సినిమా
1967: అమెరికాలో, 10వ కోటి టెలిఫోన్ ను కనెక్ట్ చేసారు (10 కోట్లు టెలిఫోన్లు).
1991: కళాభారతి ఆడిటోరియము విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.1991 మార్చి 3 విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము.
2000: భారతదేశ జనాభా 100 కోట్లకు చేరింది.

జననాలు :

1895: జిడ్డు కృష్ణమూర్తి, భారతదేశపు తత్త్వవేత్త (సాంగ్స్ ఆఫ్ లైఫ్)
1918: మృణాళినీ సారాభాయి, శాస్త్రీయ నృత్య కళాకారిణి (మ.2016)
1922: మాధవపెద్ది సత్యం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
1925: వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, రంగస్థల నటుడు, బాలనాగమ్మలో ఫకీరుగానూ, రామాంజనేయ యుద్ధంలో యయాతిగానూ, సక్కుబాయిలో శ్రీకృష్ణుడుగానూ, సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడిగా నటించారు.
1928: సామల సదాశివ, ఆదిలాబాదు జిల్లాకు చెందిన సాహితీవేత్త. (మ.2012)
1977: పోసాని సుధీర్ బాబు, తెలుగు సినిమా నటుడు. తెలుగు నటుడు ఘట్టమనేని కృష్ణ చిన్నల్లుడు.

మరణాలు :

1873: మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి, మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడు.
1994: సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (జ.1928)
2017: సి.ఆర్.ఎం.పట్నాయక్ వంశధార ప్రాజెక్టును డిజైన్ చేసిన ఇంజనీరు.