ఇంటర్ విద్యార్థులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం

  • లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ ఓం సాయి ఆధ్వర్యంలో కార్యక్రమం

జనగామ : ప్రభుత్వ జూనియర్ కళాశాల ( కో ఎడ్యుకేషన్ ) ధర్మ కంచ జనగామ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం నందు పరీక్ష రాసిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ ఓంసాయి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు దాసారం కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల మంది విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది.

ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేసినందుకు గాను లయన్స్ క్లబ్ జనగామ ఓం సాయి వారిని, కళాశాల ఇoచార్జి ప్రిన్సిపాల్ నందిని పటేల్ ను జనగామ జిల్లా ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వాహకులు బైరి శ్రీనివాస్, ధర్మేందర్, విద్యాసాగర్ రెడ్డి లు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శతి నందిని పటేల్. కళాశాల అధ్యాపక బృందం మరియు క్లబ్ సభ్యులు మల్లారెడ్డి, లక్ష్మయ్య, మహేందర్ రెడ్డి, ఆంజనేయులు, తిరుమల్ రెడ్డి, రోడ్డ మహేష్, పొన్నాల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.