మే 22 నుండి ఇంటర్ మూల్యాంకనం

తెలంగాణలో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నాలుగు విడతల్లో నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ నెల 22వ తేదీ నుంచి నాలుగు విడతల మూల్యాంకనాన్ని చేపట్టడానికి షెడ్యూలును ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఆదివారం విడుదల చేశారు.

ఈ నెల 6వ తేదీన మొదలైన ఇంటర్ వార్షిక పరీక్షలు 24వ తేదీతో ముగియనున్నాయి. ప్రధాన పరీక్షలు 19వ తేదీనే పూర్తికానున్నాయి. సంస్కృతం పేపర్ మూల్యాంకనాన్ని ఈ నెల 12న ప్రారంభించనున్నారు. ఈ పేపర్లు అధికంగా ఉండటంతో కాస్త ముందుగానే మూల్యాంకనాన్ని చేపట్టనున్నారు.

★ విడతలవారీగా షెడ్యూల్

● తొలి విడత స్పాట్ వాల్యుయేషన్ ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నది. తొలుత ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం పేపర్-1, పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్లను దిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

● 26 నుంచి మొదలయ్యే రెండో విడతలో ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లను దిద్దుతారు.

● 28 నుంచి ప్రారంభమయ్యే మూడో విడ తలో కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లను దిద్దుతారు.

● ఈ నెల 31 నుంచి మొదలయ్యే నాలుగో విడత మూల్యాంకనంలో హిస్టరీ, బాటనీ, జువాలజీ పేపర్లను దిద్దుతారు.