గంట ఆలస్యంగా ఇంటర్ పరీక్ష

  • ప్రింటర్ ద్వారా తప్పుడు సబ్జెక్ట్ బండిల్ సెంటర్ కు సరఫరా.
  • సజావుగా పరీక్ష పూర్తి.

ఈరోజు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పేపర్ పేపర్ – 1 పరీక్షను ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించింది, రాష్ట్రంలోని 1443 కేంద్రాల్లో 4.62 లక్షల మంది విద్యార్థులకు పైగా పరీక్షలు వ్రాసారు.

సూర్యాపేట జిల్లాలోని ఒక కేంద్రంలో ప్రింటర్ ద్వారా తప్పుడు సబ్జెక్ట్ బండిల్ సెంటర్ కు సరఫరా చేయబడడంతో.. దానిని గుర్తించి తెరవకుండా వెంటనే సమీపంలోని పరీక్షా కేంద్రాల నుండి, జిల్లా బల్క్ మరియు స్పేర్ ప్రశ్న పత్రాల నుండి సరైన సబ్జెక్ట్ ప్రశ్న పత్రాలను తెచ్చి సంబంధించిన పరీక్ష కేంద్రానికి సరఫరా చేయడంతో దాదాపు గంట ఆలస్యంగా విద్యార్థులకు ప్రశ్నపత్రాలు సరఫరా అయ్యాయి.

ఈ కేంద్రంలోని విద్యార్థులకు పరీక్ష రాసేందుకు మూడు గంటల సమయం కేటాయించారు. దీంతో కేంద్రంలో పరీక్ష సజావుగా సాగిందని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.