బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు పాలిసెట్ ద్వారానే…

బాసరలోని ట్రిబుల్ ఐటీ లో సీట్లు ఈ విద్యా సంవత్సరం కూడా పాలీసెట్ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ల ఆధారంగానే కేటాయించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ లలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా పాలిసెట్ 2022 ర్యాంకులు ఆధారంగానే సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.

పాలీసెట్ 2022 నోటిఫికేషన్ ను మే 9వ తేదీన విడుదల చేయనున్నట్లు, దరఖాస్తు చివరి తేదీ జూన్ 4, ప్రవేశపరీక్ష జూన్ 30న నిర్వహించనున్నట్లు తెలిపారు.