ఎంసెట్, జేఈఈ, నీట్ లకు ఉచిత శిక్షణ

ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ నెల చివరి వారం నుంచి ఉచిత శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించింది. ఆన్ లైన్ తో పాటు ఆఫ్లైన్ లోనూ శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

ఆన్ లైన్లో క్లౌడ్ ఎడ్జ్ సంస్థ సహకారంతో ఉచిత శిక్షణ ఇవ్వనుండగా, జిల్లాల్లో 32 కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. ఈ నెల 20 లేదా 21వ తేదీ నుంచే ఉచిత శిక్షణను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.

విద్యార్థులు tscie.rankr.io లింక్ ద్వారా ఇంట్లోనే ఉండి కోచింగ్ తీసుకోవచ్చు. గత ఏడాది సైతం ఇదే తరహాలో శిక్షణ ఇవ్వగా, రాష్ట్రంలోని 20 వేల మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకోగా, 2,685 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించారు.