నేటి నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9,07,394 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

మొదటిరోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలతో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎండాకాలం కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు.