చరిత్రలో ఈరోజు మే 04

★ దినోత్సవం :

  • అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం
  • వరల్డ్ గివ్ ( give ) డే.

★ సంఘటనలు :

  • 1979: ఇంగ్లాండ్ ఎన్నికలలో మార్గరెట్ థాచర్ ఘన విజయం.
  • 1989: అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ [1] అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, శుక్రగ్రహం మీద నెమ్మదిగా దిగి, అక్కడి శుక్రగ్రహం నేలను, పర్వతాలను, గోతులను, పటాలుగా (మేప్) తయారుచేయటం మొదలుపెట్టింది. ఆ నౌక శుక్రగ్రహం మీద కొన్ని సంవత్సరాలు ఉంటుంది. భూగ్రహం మీద 8 నెలలు అయితే, అక్కడ ఒక రోజు అవుతుంది. శాస్త్రవేత్తలు, శుక్రగ్రహంని నరకద్వారం లేదా పాతాళలోకం అంటారు ఎందుకంటే ఆ గ్రహం నివసించటానికి పనికిరాదు.

జననాలు :

  • 1767: త్యాగరాజు, (త్యాగయ్య, త్యాగబ్రహ్మ). నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. (మ. 1847)
  • 1911: ఎస్.వి.ఎల్. నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
  • 1934: అక్కిరాజు రమాపతిరావు, పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత
  • 1942: దాసరి నారాయణరావు, సినిమా దర్శకుడు, రచయిత, సినీ నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2017)
  • 1950: కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు.
  • 1950: నరమల్లి శివప్రసాద్, తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు.
  • 1960: డి. కె. అరుణ, ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేసింది.

మరణాలు:

  • 1979: గుడిపాటి వెంకట చలం, రచయిత. (జ. 1894)
  • 1799: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (జ.1750)