యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల

• మే 20 వరకు దరఖాస్తులు

యూజీసీ నెట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2021 డిసెంబర్, 2022 రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు ఏప్రిల్ మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

మొత్తం 82 సబ్జెక్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డులు డౌన్ లోడింగ్ సహా పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ ప్రకటించింది.

నెట్ స్కోర్ సాధిస్తే జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడే అవకాశం ఉంటుంది.

జనరల్, అన్ రిజర్వుడ్ లకు పరీక్ష ఫీజు రూ.1,100, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ.550, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, థర్డ్ జెండర్ రూ.275 చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలకు : http://ugcnet.nta.ac.in చూడా లని సూచించింది.