విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకునేలా ఇంటర్ హల్ టికెట్లు విడుదల

  • విద్యార్థులు నేరుగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం
  • తప్పులుంటే కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలి.

మే 6వ తారీఖున నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల హాల్ టికెట్లను తమ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షలు రాయవచ్చని… ఈ హల్ టికెట్లు పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని ప్రకటనలో తెలిపారు.

అలాగే హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లేదా జిల్లా ఇంటర్ విద్యాధికారి దృష్టికి తీసుకువెళ్లాలని తద్వారా తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుందని తెలిపారు. పేరు, గ్రూపు, మీడియం తదితర అంశాలను హాల్ టికెట్లలో సరిచేసుకోవాలని తెలిపారు.