నేటి నుంచి గ్రూప్ – 1 దరఖాస్తులు

గ్రూప్-1 పరీక్ష కోసం సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-1 ద్వారా 503 పోస్టుల భర్తీకి ఇప్పటికే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు సోమవారం నుంచి మే 31వ తేదీ వరకు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

దరఖాస్తుకు ముందే ఓటీఆర్ లో మార్పులు చేసుకోవాలని సూచించింది.

★ కొత్తగా 64 వేల మంది ఓటీఆర్

టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల కోసం కొత్తగా 64,779 మంది అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారు. ఇప్పటికే ఓటీఆర్ చేసుకున్నవారిలో 1,48,005 మంది వివరాల్లో మార్పులు చేశారు. ఇలా మొత్తంగా ఆదివారం వరకు 2,12,784 మంది ఓటీఆర్ లో వారి వివరాలను నమోదు చేసుకున్నట్లు టీఎస్పీ ఎస్సీ వెల్లడించింది.