మే 2 నుంచి హైకోర్టుకు సెలవులు

తెలంగాణ హైకోర్టుకు మే 2 నుంచి జూన్ 3వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ గురువారం రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీచేశారు. జూన్ 6న హైకోర్టు తిరిగి ప్రారంభం కానుంది. అయితే అత్యవసర కేసులు విచారణ నిమిత్తం మే 5, 12, 19, 26, జూన్ 2న కోర్టు ప్రత్యేక బెంచ్ లు ఉంటాయన్నారు.

ప్రతి సోమవారం పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని, గురువారం విచారణ ఉంటుందని తెలిపారు. మే 5న జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ డి. నాగా ర్జునలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ ఎ.సంతోష్ రెడ్డి సింగిల్ బెంచ్ ఉంటాయని, 9న జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ ఎన్. వి. శ్రావణ్ కుమార్ల ధర్మాసనం, జస్టిస్ జి. అనుపమా చక్రవర్తి సింగిల్ బెంచ్, 16న జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి, జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ల ధర్మాసనం, జస్టిస్ జె. శ్రీదేవి సింగిల్ బెంచ్, 26న జస్టిస్ టి. వినోద్ కుమార్, జస్టిస్ పి. మాధవిదేవిలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ ఎస్. నందల సింగిల్ బెంచ్, చివరివారం జస్టిస్ జి. శ్రీదేవి, జస్టిస్ ఎం. లక్ష్మణ్ తో కూడిన ధర్మాసనం, జస్టిస్ ఎన్. తుకారాంజీ సింగిల్ బెంచ్ లు విచారణను చేపడతాయన్నారు.