కాంట్రాక్టు ఉద్యోగుల /లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రకటన మద్దతు సభ

తెలంగాణ రాష్ట్రంలోని జీవో 16, కాంట్రాక్టు ఉద్యోగుల /లెక్చరర్ల క్రమబద్దీకరణ కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు మద్దతుగా మే ఒకటో తారీఖున (మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో”) కాంట్రాక్టు ఉద్యోగుల/ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రకటన మద్దతు సభ నిర్వహిస్తున్నట్లు జీవో నెంబర్ 16 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల/ లెక్చరర్ల క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర సమితి కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్టు ఉద్యోగుల బాధలు చూసి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కే చంద్రశేఖర రావు తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి, టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చడం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో కే. చంద్రశేఖర రావు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను కేబినెట్ లో ఆమోదించి… జీవో నెంబర్ 22 ద్వారా సీనియర్స్ IAS ఆఫీసర్లతో కమిటీని నియమించి, ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొరకు 2016లో జీవో నెంబర్ 16 జారీ చేయగా ఇద్దరు వ్యక్తులు గౌరవ న్యాయస్థానంను ఆశ్రయించగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో తాత్కాలికంగా క్రమబద్ధీకరణ నిలిచిపోయింది,2021 డిసెంబర్ 7న గౌరవ హైకోర్టు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై సానుకూల ప్రకటన చేయడం జరిగింది, ఈ ప్రకటనకు మద్దతుగా జీవో నెంబర్ 16 పరిధిలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్స్ మే ఒకటో తారీకు హైదరాబాదులో మద్దతు సభ నిర్వహిస్తున్నామని…
ఈ సభలో పలువురు మేధావులు పాల్గొంటారని… ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక తరపున విజ్ఞప్తి చేసినట్లు డా. కొప్పశెట్టి సురేష్ తెలిపారు