ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

రాష్ట్రంలోని ఉద్యోగార్థుల‌కు ప్ర‌భుత్వం మ‌రో తీపి క‌బురు అందించింది. మొన్న కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి, నిన్న గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడిన విష‌యం విదిత‌మే. తాజాగా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది.

ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌(ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల 614కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.