ఘనంగా తాడ్వాయి కళాశాలలో వీడ్కోలు వేడుకలు

  • ముఖ్య అతిధిగా తహశీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్
  • పది వేల రూపాయలు విరాళం
  • కళాశాల అభివృద్ధిలో ప్రిన్సిపాల్ కృషికి ప్రశంసలు

తాడ్వాయి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తాడ్వాయి తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్ విద్యార్థి జీవితంలో సమయాన్ని సజీవంగా అర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులే సృజనాత్మకతో సమాజాహితం కోరే పౌరులుగా ఎదుగుతారని అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో అరణ్య జ్ఞాన పుష్పాలు ముందు వరుసలో ఉండాలని కోరారు.

కళాశాల సౌకర్యాల కల్పనలో, చదువు, కళలలో విద్యార్థులు ఉన్నతంగా రాణించడానికి విశేష కృషి చేస్తున్న ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ ను అధ్యాపకులను అభినందించారు.

ఈ సందర్బంగా నీట్, ఎంసెట్, లాసెట్ వంటి పోటీ పరీక్షల ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కావాల్సిన పదివేల రూపాయలు ఫీజులను అందించారు.

ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి తిరిగి చెల్లించండి అనే కార్యక్రమంలో తాడ్వాయి కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న తహశీల్దార్ కు కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. పౌర సమాజం, ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన పలు కార్యక్రమాలను కళాశాల వార్షిక నివేదిక ద్వారా తెలియచేసారు.

పలువురు విద్యార్థులు తమ ప్రసంగాల్లో తమ జ్ఞాన వికాసానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి కళాశాల చేసిన కృషిని కొనియాడారు. ఆదివాసీ, జానపద సాంస్కృతిక నృత్యగేయాలతో విద్యార్థుల విభావరి ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాములు నాయక్, మూర్తి, సంధ్య, కిషన్, శ్వేత, శ్రీలత, రాజ్ కుమార్, రాజు, అశోక్, బిక్షం, సోఫియా మరియు విద్యార్థులు పాల్గొన్నారు.