సుప్రీంకోర్టు లో ఆర్జేడి అసోసియేషన్ ఆధ్వర్యంలో కెవియట్ పిటిషన్

కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో డాక్టరేట్ అసోసియేషన్ 16 జీవో పైన వేసిన రిట్ పిటిషన్ నం. 17709 / 2022 ను చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ & జస్టిస్ అభినంద్ కుమార్ షావలి ధర్మాసనం 21.04.2022 రోజున కొట్టేసిన విషయం తెలిసిందే.

అయితే డాక్టరేట్స్ అసోసియేషన్ ఇదే విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న నేపథ్యంలో 17709 / 2022 W.P పై ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం & సహకారంతో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు యుగేందర్ ముక్క పేరుతో కెవియట్ పిటిషన్ 26.04.2022 వేయడం జరిగిందని ఆర్జెడి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ లు తెలిపారు.

గతంలో జీవో నెంబర్ 16 పైన ఆర్జెడి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే… కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో ఎలాంటి అలసత్వం లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు.