తెలంగాణ గ్రూప్స్ ఉద్యోగాల కీలక సమాచారం విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1, 2, 3, 4, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించిన పోస్టుల కేటగిరీలు, పరీక్ష విధానం, పరీక్ష పేపర్ ల సంఖ్య, సిలబస్ లను వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

★ గ్రూప్ – 1 ::

గ్రూప్ -1 సర్వీస్ కింద 19 రకాల ఉద్యోగాలను గుర్తించింది. పరీక్ష విధానంలో ప్రిలిమ్స్ పరీక్ష 150 మార్కుల చొప్పున ఒక పేపర్, మెయిన్స్ పరీక్ష నందు ఏడు పేపర్లు ఉండనున్నాయి. మొత్తం 900 మార్కులకు గ్రూప్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి ఇంటర్వ్యూలు లేవు.

ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 1:50 నిష్పత్తిలో మెయిన్స్ కీ అనుమతి ఇస్తారు.

★ గ్రూప్ – 2 ::

గ్రూప్ -2 సర్వీసుల కింద 16 రకాల పోస్టులను గుర్తించారు. పరీక్ష విధానంలో నాలుగు పేపర్లు ఉండనున్నాయి. 600 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు.

★ గ్రూప్ – 3 ::

గ్రూప్ – 3 సర్వీసుల కింద ఎనిమిది రకాల కేటగిరీ పోస్టులను గుర్తించారు. పరీక్ష విధానం 3 పేపర్లతో నిర్వహించబడును. 450 మార్కులకు నిర్వహించబడును. ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు.

★ గ్రూప్ – 4 ::

గ్రూప్ – 4 ఉద్యోగాలకు జనరల్ స్టడీస్, సెక్రటరీ ఎబిలిటీస్ అనే రెండు పేపర్లను ఒక్కో పేపర్ కు 150 మార్కులు చొప్పున 300 మార్కులకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో నిర్వహిస్తారు.

గెజిటెడ్ ఉద్యోగాలు 450 మార్కులకు, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు 300 మార్కులకు నిర్వహించనున్నారు.

పూర్తి ఉత్తర్వులు కాపీ