పరీక్షల పై 28న మంత్రి సమీక్ష సమావేశం

మే నెలలో జరగనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మరియు జూన్ లో జరగనున్న టెట్ పరీక్ష నిర్వహణపై తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత శాఖ అధికారులతో ఏప్రిల్ 28 న కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.

పరీక్షల నిర్వహణకు చేయవలసిన ఏర్పాట్లు, తీసుకోవలసిన చర్యలపై మంత్రి అధికారులకు సూచనలను చేయనున్నారు.