కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రభుత్వం కట్టుబడి ఉంది – మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయుటకు కట్టుబడి ఉందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు మరియు వికలాంగుల అభివృద్ధి శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్ అన్నారు.

గొల్లపెల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ మరియు శంకుస్థాపనల కార్యక్రమానికి విచ్చేసిన మంత్రిని కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లు సన్మానించారు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు .

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టడం చాలా ఆనందదాయకమని కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల జీవితాల్లో ఈ నిర్ణయం వెలుగు నింపిందని క్రమబద్ధీకరణ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కళాశాల అధ్యాపకులు మంత్రిని కోరారు. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచాలని కోరగా వయోపరిమితి పెంచుటకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో 475 సంఘం జిల్లా అద్యక్షులు రేమిడి మల్లారెడ్డితో పాటు కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రసాద్, నాగలక్ష్మి, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.