క్రమబద్దీకరణ వేగవంతం చేయాలంటూ మంత్రి కొప్పులకు 711 జగిత్యాల శాఖ వినతిపత్రం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరించడానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.

గొల్లపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా విచ్చేసిన మంత్రిని 711 సంఘం రాష్ట్ర నాయకులు బండ వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గొల్లపల్లి కాంట్రాక్టు అధ్యాపకులు కలిసి క్రమబద్దీకరణకై విన్నవించారు.ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా 711 సంఘ రాష్ట్ర నాయకులు బండ వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల, అధ్యాపకుల క్రమబద్ధీకరణ కట్టుబడి ఉండి‌, చిత్తశుద్ధితో పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు రుణపడి ఉంటామని తెలిపారు.

అలాగే 711 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం నేతృత్వంలో ఎలాంటి అవరోధాలు లేకుండా కాంట్రాక్టు అధ్యాపకులు అందరూ అతి త్వరలోనే క్రమబద్ధీకరణ చెందుతారని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వెంకట కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, రాంప్రసాద్, తిరుపతి, రాజ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.